Realme: "Realme 14 Pro+" ఇప్పుడు కొత్త వేరియంట్ తో.. ఎక్కువ స్టోరేజ్! 6 d ago

రియల్‌మీ అభిమానులకు శుభవార్త! అద్భుతమైన ఫీచర్లతో, వేగవంతమైన పనితీరుతో అందరి మెప్పు పొందిన Realme 14 Pro+ మొబైల్ కొత్త వేరియంట్‌ని రియల్‌మీ కంపెనీ ప్రవేశపెట్టనుంది. 12GB RAM + 512GB స్టోరేజ్ కొత్త వేరియంట్‌ను మార్చి 6వ తేదీన విడుదల చేయనుంది. ఈ ఫోన్ ఇప్పటికే అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లో మంచి స్థానాన్ని సంపాదించుకుంది... తాజాగా ఈ కొత్త వేరియంట్ తో కొత్త అనుభూతిని అందిస్తుంది. Realme 14 Pro+ ఫీచర్లు గురించి తెలుసుకుందాం రండి!
Realme 14 Pro+ ఫీచర్లు:
డిస్‌ప్లే: 6.83-అంగుళాల FHD+ OLED
రిఫ్రెష్ రేట్: 120Hz
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 SoC
బ్యాటరీ: 6,000mAh
ఛార్జింగ్: 80W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ v15
కెమెరా ఫీచర్లు:
బ్యాక్ కెమెరా:
- 50MP మెయిన్ కెమెరా
- 50MP టెలిఫోటో కెమెరా
- 8MP అల్ట్రావైడ్ కెమెరా
ఫ్రంట్ కెమెరా: 32 MP
వేరియంట్స్:
- 8GB RAM + 128GB స్టోరేజ్.
- 8GB RAM + 256GB స్టోరేజ్.
- 12GB RAM + 256GB స్టోరేజ్.
- 12GB RAM + 512GB స్టోరేజ్ (కొత్త వేరియంట్)
ఫోన్ రంగులు:
- పీర్ల్ వైట్
- స్వీడ్ గ్రే
ఇతర ఫీచర్లు:
- ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్
- స్టీరియో స్పీకర్ సెటప్
- డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్స్
లోపాలు:
ఈ ఫోన్ కి చెప్పుకోవడానికి లోపాలు పెద్దగా లేవు. కొత్త వేరియెంట్ పర్పుల్ రంగులో అందుబాటులో లేదు. కొన్ని పోటీ ఫోన్లతో పోలిస్తే దీని ధర కాస్త ఎక్కువ.
చూశారుగా Realme 14 Pro+ ఎంత అద్భుతంగా ఉందో. దీని ధర రూ.35 వేల నుండి ప్రారంభం అవుతుంది. కొత్త వేరియంట్ ధర రూ. 37,999 ఉంటుంది. పెద్ద బ్యాటరీ, అద్భుతమైన కెమెరా సెటప్, శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ తో అందరిని ఆకట్టుకుంది. 512GB స్టోరేజ్‌తో ఎక్కువ డేటా స్టోర్ చేసుకోవచ్చు.. గేమింగ్ కి ఈ ఫోన్ సూపర్ ఉంటుంది. మార్చి 6వ తేదీ నుండి ఈ ఫోన్ అమ్మకానికి వస్తుంది.
ఇది చదవండి: పోకో M7 5G ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ!